రివ్యూ : టాక్సీవాలా

చిత్రం : టాక్సీవాలా (2018)

నటీనటులు : విజయ్‌ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్.. తదితరులు

సంగీతం : జాక్స్‌ బెజోయ్‌

దర్శకత్వం : రాహుల్ సంక్రిత్యాన్‌

నిర్మాత : జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్

రిలీజ్ డేటు : 17 నవంబర్, 2017

రేటింగ్ : 3/5

రౌడీ.. లవ్వర్ గా మారి మెప్పించడం చూశాం. ఇప్పుడీ లవ్వర్ టాక్సీవాలాగా మారాడు. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టాక్సీవాలా’. ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరోయిన్లు. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. విడుదల ముందే సినిమా లీకవ్వడం చిత్రబృందాన్ని షాక్ కి గురిచేసింది. అయినా.. సినిమాపై ఉన్న నమ్మకంతో ధైర్ఘ్యంగా విడుదలకి రెడీ అయ్యారు. దీనికి టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ స్టార్స్ సపోర్టు దక్కింది. భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘టాక్సీవాలా’ ఎలా ఉన్నాడు ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొన్నాడు ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

శివ (విజయ్‌ దేవరకొండ) బిలో యావరేజ్ స్టూడెంట్. ఆయనకి డిగ్రీ పూర్తి చేయడానికే ఐదేళ్లు పట్టింది. హైదరాబాద్ వెళ్లి సేహితుడు (మధు నందన్‌) దగ్గర ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలెడతాడు. ఒకట్రెండు ట్రై చేసిన వర్కవుట్ కావు. దీంతో వదిన బంగారం అమ్మి ఇచ్చిన డబ్బుతో ఓ కారుకొని క్యాబ్ డ్రైవర్ గా మారతాడు. టాక్సీ తొలి రైడ్‌లోనే అను అమ్మాయితో ప్రేమలో పడతాడు. అంతా హ్యాపీ అనుకొంటున్న సమయంలో టాక్సీలో దెయ్యం ఉందని తెలుస్తుంది.

కారులో ప్రయాణించిన ఓ డాక్టర్ ను ఆ కారు అతి దారుణంగా చంపేస్తోంది. అసలు డాక్టర్ ని కారు ఎందుకు చంపింది ? కారు రెవెంజ్ వెనక ఉన్న సస్పెన్స్ ఏంటీ ?? శివతో శివకు ఆ కార్ కు ఎందుకు అంత అటాచ్ మెంట్ పెరుగుతుంది ? ఫైనల్ గా ఆ కారు ఎవరి పై రివేంజ్ తీసుకోవాలనుకుంటుంది ? అనేది సూపర్‌ నేచురల్ థ్రిల్లర్‌ గా సాగిన మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

* విజయ్ నటన

* కామెడీ, ఎమోషనల్ సీన్స్

* సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

* గ్రాఫిక్స్

* సెకండ్‌ హాఫ్‌లో కొన్ని సీన్స్‌

నటీనటుల ఫర్ ఫామెస్ :

దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్‌ సినిమాని చాలా సరదాగా మొదలెట్టాడు. అతికష్టం మీద డిగ్రీ పాసైన కుర్రాడు.. ఉద్యోగం కోసం పడే పాట్లు, స్నేహితులతో సరదా సన్నివేశాలు ప్రేక్షకుడి ఎంటర్ టైనర్ చేసేలా ఉన్నాయి. కారు కొనుకొన్న క్యాబ్ డ్రైవర్ గా మారిన హీరో.. ఇక అంతా హ్యాపీ అనుకొనే సమయంలో కారులో దెయ్యం ఉందనే పాయింట్ తో హార్రర్ టచ్ ఇచ్చాడు. ఇక, సెకాంఢాఫ్ లో రివెంజ్ డ్రామా, ఎమోషనల్ సన్నివేశాలని బలంగా రాసుకొన్నాడు. ఐతే, ఫస్టాఫ్ ని సరదాగా ఎంజాయ్ చేసిన ప్రేక్షకుడు సెకాంఢాఫ్ లో కాస్త నెమ్మదించినట్టు ఫీలయ్యేలా అనిపించింది. ఐతే, బలమైన ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ ఏపీసోడ్ సినిమాని నిలబెట్టింది.

ఇక, విజయ్ నటనకి వంకపెట్టలేం. రౌడీ గా, లవర్ గా మెప్పించిన విజయ్.. ఈసారి భయపడటం కూడా బాగా చూపించాడు. ఫస్టాఫ్ లో వచ్చే సరదా సన్నివేశాలు విజయ్ కి కొట్టిన పిండి. అందులో అద్భుతంగా నటించారు. సెకాంఢాఫ్ లో.. ఎమోషనల్ సన్నివేశాలో ఆయన నటన అద్భుతం. హీరోయిన్ ప్రియాంక పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. ఐతే, గ్లామర్ తో ఆకట్టుకొంది.

మరో హీరోయిన్ మాళవిక నాయర్‌ కి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. అందులో ఆమె మెప్పించింది. హీరో ఫ్రెండ్‌గా నటించిన మధుసూదన్‌ మంచి కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. ఇతర పాత్రల్లో శిజు, కళ్యాణీ, యమున, రవివర్మ, రవిప్రకాష్‌, ఉత్తేజ్‌లు తదితరులు తమ తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా :

సాయికుమార్ రెడ్డి అందించిన స్క్రీన్ ప్లే సినిమాకు ప్రాణంగా నిలిచింది. జేక్స్ బిజాయ్ అందించిన పాటల్లో ‘మాట వినదు.. ‘ బాగుంది. రీరికార్డింగ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. ప్రతీ సన్నివేశాన్ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరోస్థాయికి తీసుకెళ్లింది. విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకొనేలా లేవు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. గీతాఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : ‘టాక్సీవాలా’ శీల పరీక్ష ఎదుర్కొంది. ముందే సినిమ లీకవ్వడం. పలు మార్లు విడుదల వాయిదా పడటంతో సినిమాపై ఆశలు వదిలేసుకొన్నారు. అందులో ఏమీ లేదనే నెగటివ్ ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో ఏమీ మాత్రం నిజం లేదని తేలిపోయింది. టాక్సీవాలా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. విజయ్ తన నటనతో మరోసారి షాక్ ఇచ్చాడు.

బాటమ్ లైన్ : టాక్సీవాలా – సరదాగా ఉన్నాడు.. చూసేయండీ !

రేటింగ్ : 3/5