రివ్యూ : తొలిప్రేమ


చిత్రం : తొలిప్రేమ (2018)
నటీనటులు : వరుణ్ తేజ్, రాశి ఖన్నా
సంగీతం : థమన్
దర్శకత్వం : వెంకీ అట్లూరి
నిర్మాతలు: బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్‌
రిలీజ్ డేటు : 10 ఫిబ్రవరి, 2018
రేటింగ్ : 3.5/5

మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ రూటే సపరేటు. మిగితా మెగా హీరోల్లా మాస్ జపం చేయడం లేదు. అవసరమైనంత వరకు మాత్రమే తనలోని మాస్, యాక్షన్’ని చూపిస్తు ముందుకెళ్తున్నాడు. కెరీర్ ని కూల్ గా ముందుకు సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ‘కంచె’లాంటి విభిన్నమైన సినిమాతో ప్రేక్షకులని ఆకట్టుకొన్నాడు. ‘ఫిదా’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆయన నుంచి వస్తున్న మరో విభిన్నమైన సినిమా ‘తొలిప్రేమ’. వెంకీ అట్లూరి దర్శకుడు. వరుణ్ తేజ్-రాశీఖన్నా ప్రేమజంటగా నటించింది.

పవన్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వరుణ్ ‘తొలిప్రేమ’ టీజర్, ట్రైలర్, పాటలు చూస్తే ఆ అంచనాలని అందుకొనేలానే కనబడింది. మరీ.. భారీ అంచనాలు, అంతుకుమించి పాజిటివ్ టాక్ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన వరుణ్ తేజ్-రాశీఖన్నాల ‘తొలిప్రేమ’ ఎలా ఉంది ? అది ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పందడీ.. !

కథ :
వైజాగ్ నుంచి హైదరాబాద్’కు రైల్ ప్రయాణంలో ఆదిత్య (వరుణ్ తేజ్)కు వర్ష (రాశిఖన్నా) పరిచయం అవుతోంది. తొలిచూపులోనే ఆమెని ఇష్టపడతాడు. ఆ సమయంలో మిస్సయిందని ఫీలవుతున్న సమయంలో.. అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేరుతుంది. వీరి ప్రేమ ప్రయాణం మళ్లీ మొదలవుతుంది. ఐతే, కాలేజీలో జరిగిన ఒక ఘటనతో వీరిద్దరు విడిపోతారు. చదువు తర్వాత లండన్ లో ఉద్యోగంలో చేరుతాడు ఆదిత్య. ఆదిత్య కంపెనీలోనే వర్ష చేరుతోంది. విడిపోయి దాదాపు ఆరేళ్ల తర్వాత కలిసిన ఈ జంట మళ్లీ ఎలా ఒక్కటయ్యారు ? అనేది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :
* వరుణ్ తేజ్, రాశీఖన్నాల నటన
* సినిమాటోగ్రఫీ
* సంగీతం

మైనస్ పాయింట్స్
* సెకాంఢా కాస్త నెమ్మదించింది

ఎవరెలా చేశారంటే ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ ‘తొలిప్రేమ’ని టచ్ చేయడంతోనే దర్శకుడు వెంకీ అట్లూరిలో ధైర్ఘ్యం కనబడింది. ఆ టైటిల్ కి ఏమాత్రం అన్యాయం చేయకొండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ.. సినిమా తీశాడు. ఈ తరం యువతలో పుట్టే తొలిప్రేమ, బ్రేకప్ గల కారణాలు, వయసు పెరుగుతున్న కొద్ది ‘తొలిప్రేమ’ని సక్సెస్ చేసుకోవాలనే తపనని దర్శకుడు అద్భుతంగా చూపించాడు. కలం, కథనం.. అన్నీ సందర్భానుసారంగా కుదిరాయి.

ఈ సినిమాకు ప్రేమజంట వరుణ్ తేజ్, రాశీఖన్నాలు రెండు స్థంభాల్లా నిలిచారు. మూడు వయసుల్లోని ప్రేమని స్పష్టమైన బాడీ లాంగ్వేజ్ తో చూపి ఆకట్టుకొన్నారు. ఊహలు గుసగుసలాడే తర్వాత రాశీఖన్నా మరోసారి బాగా నటించింది అనిపించింది. వరుణ్ తేజ్ సినిమా సినిమాకు నటనలో పరిణితి చెందుతున్నాడు. తొలిప్రేమ వరుణ్ తేజ్ ని ఓ మెట్టెక్కించిందని చెప్పవచ్చు.

హైపర్ ఆది, ప్రియదర్శి, నరేష్ లు ప్రేక్షకులని నవ్వించగలిగారు. సెకాంఢాప్ లో వచ్చే ప్రేమ తాలూకు డైలాగులు బాగున్నాయి. హీరో, హీరోయిన్స్ తో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేయగలిగారు.

సాంకేతికంగా :
వెంకీ అట్లూరికి ఇది తొలి సినిమానే అయినా.. ప్రతి సీన్ కి కొలిచినట్టు నేపథ్యం ఎంచుకొన్నాడు. తొలిప్రేమని ఓ జర్నీలా తీసుకొన్నాడు. దీనికి సంబంధించిన నేపథ్యాలని ఫర్ ఫెక్ట్ గా ఎంచుకొన్నాడు. తొలిచూపు ట్రైన్, ప్రేమప్రయాణం, బ్రేకప్ కోసం కాలేజీ, తొలిప్రేమని సక్సెస్ చేసుకొనేందుకు ఉద్యోగం నేపథ్యాలని ఎంచుకొని వాటికి తగ్గట్టుగా మాటలు, పాటలు రాసుకొన్నాడు.

థమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం రెండు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. లండన్ ఏపీసోడ్ తెరపై అద్భుతంగా అనిపించింది. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకాంఢాఫ్ నెమ్మదించింది.ఒకట్రెండు సీన్స్ కావాలని ఇరికించినట్టు అనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బాటమ్ లైన్ : తొలిప్రేమ.. మనసుకు తాకేలా ఉంది

రేటింగ్ : 3.5/5