రివ్యూ : యాత్ర


చిత్రం : యాత్ర (2019)

నటీనటులు : మమ్మూట్టి, రావురమేష్‌, అనసూయ, సుహాసిని తదితరులు

సంగీతం : కే కృష్ణకుమార్

నిర్మాత : విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి

దర్శకత్వం : మహి వీ రాఘవ

రిలీజ్ డేటు : 08ఫిబ్రవరి, 2019.

రేటింగ్ : 3/5

ఆంధ్రపదేష్ లో కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిపోయిన రోజులవి. కొన ఊపిరితో ఉన్న ఆంధ్రా కాంగ్రెస్ కు తన పాదయాత్రతో ప్రాణం పోసిన మహానేత డా॥ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ పాదయాత్ర కాంగ్రెస్ ని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చింది. ఒకటి కాదు.. వరుసగా రెండు సార్లు. కేంద్రానికి ఏపీ నుంచి అత్యధిక ఎంపీ స్థానాలని కూడా అందించాడు వైఎస్. ఇప్పుడీ ఈ పాదయాత్ర ఇతివృత్తంగా
వైఎస్ఆర్ బయోపిక్ ‘యాత్ర’ తెరకెక్కింది. ఈ చిత్రానికి మహి.వి రాఘవ్ దర్శకత్వం వహించారు. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించారు. భారీ అంచనాల ‘యాత్ర’ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇంతకీ వైఎస్ఆర్ ‘యాత్ర’ ఎలా సాగింది.. ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం.. పదండీ.. !

కథ :

దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేసిన పాదయాత్ర ఘట్టాన్ని ‘యాత్ర’గా తెరకెక్కించారు. ఆయన పాదయాత్రకు దారి తీసిన పరిస్థితులేంటి ? పాదయాత్రలో వైఎస్‌ఆర్‌కు ఎదురైన అనుభవాలు… వాటి వల్ల వైఎస్‌ వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులేంటీ ? పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి కష్టాల్లో ఉన్న పార్టీని వైఎస్‌ఆర్ తన పట్టుదలతో ఎలా విజయతీరాలకు చేర్చారు.. ? అనేది కథ. ఐతే, ఆ కథని ఎమోషన్స్ టచ్ చేస్తూ.. వైఎస్ఆర్ అభిమానులు నచ్చేలా, మెచ్చేలా తెరకెక్కించారు.

ప్లస్ పాయింట్స్ :

* కథనం

* మమ్ముట్టి నటన

* ఎమోషన్స్

* క్లైమాక్స్ లో జగన్ స్పీచ్

మైనస్ పాయింట్స్ :

* వైసీపీ ఎన్నికల ప్రచార అస్త్రంగా అనిపించింది. దీంతో అన్నివర్గాల వారినీ ఆకట్టుకోపోవచ్చు.

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

2004 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర తాలుకు సంగతులు చాలామందికి తెలుసు. ఐతే, ఆ పాదయాత్రకి దారి తీసిన సంగతలు. యాత్రలో వైఎస్ఆర్ ఎదుర్కొన్న సమస్యలు, అనుభవాలు.. తద్వారా ఆయనలో వ్యక్తిత్వంలో వచ్చిన మార్పుల గురించి మాత్రం చాలామంది తెలీదు. వాటినే యాత్ర కథాంశంగా ఎంచుకొన్నాడు దర్శకుడు మహి.వి రాఘవ్. కథని ఎమోషన్ గా డీల్ చేశాడు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోపాలని ప్రస్తావిస్తూ.. వాటిని వైఎస్ఆర్ ఎలా అధిగమించాడు. తిరిగి పార్టీని ఎలా అధికారంలోకి తీసుకొచ్చాడు అనేది ఆకట్టుకొనే చూపించాడు దర్శకుడు.

నేరుగా కథలోకి వెళ్లి ఎమోషనల్ గా కథని నడిపారు దర్శకుడు. సినిమాలో మెయిన్ గా కథ కంటే వైఎస్ కి సంబంధించిన పొలిటికల్ సిచువేషన్స్ ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. వైఎస్ పాత్రలో మమ్ముట్టి ఒదిగిపోయారు. ఆయన నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. రాజశేఖర్ రెడ్డి రాజసం, హుందాతనం, రాజకీయం, నమ్మిన వారికోసం ఎంతకైన తెగించే వ్యక్తిత్వం లాంటి విషయాలను తెర మీద అద్భుతంగా పలికించాడు. విజయమ్మ పాత్రలో ఆశ్రిత సరిగ్గా సరిపోయారు. లుక్‌ పరంగాను ఆమె విజయమ్మను గుర్తు చేశారు. తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఆమె పాత్ర గుర్తుండి పోతుంది.

మరో కీలక పాత్రలో కనిపించిన రావూ రమేష్ తనదైన నటనతో కేవీపీ పాత్రకు ప్రాణం పోశాడు. తెర మీద కనిపించింది కొద్దిసేపే అయిన అనసూయ, సుహసిని, పోసాని కృష్ణమురళిలు.. వారు పోషించిన పాత్రలకు జీవం పోశారు. వైఎస్ఆర్ కు బద్దశత్రువు చంద్రబాబుపై సటైర్స్ వేసి.. ఆయన అభిమానులని సంతోషపెట్టాడు. , క్లైమాక్స్ లో జగన్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. జగన్ తండ్రి గురించి మాట్లాడే ఒరిజినల్ సీన్ తో సినిమాని ముగించారు. ఆసమయంలో ఈలలు, కేకలతో థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. వైఎస్ఆర్ చెల్లెలు సబిత పాత్ర బాగుంది.

సాంకేతికంగా :

‘యాత్ర’లో పాటలు బాగున్నాయి. ఎమోషనల్ గా సాగాయి. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. ముఖ్యంగా డైలాగ్స్ గురించి చెప్పుకోవాలి. సన్నివేశానికి తగ్గట్టు డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. అక్కడక్కడ పొలిటికల్‌ సెటైర్‌లు కూడా బాగా పేలాయి. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర పెద్దల ఆహార్యం, వారి డైలాగ్స్‌ సినిమాకు కామెడీ టచ్‌ ఇచ్చాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : వైఎస్ఆర్ ‘యాత్ర’.. ఆయన అభిమానులకి విందుభోజనం.

రేటింగ్ : 3/5