మహేష్27 ఫిక్స్.. !

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంగా ‘మహర్షి’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకుడు. మహేష్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే సినిమాకు మహేష్ ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు.

ఇదిలావుండగా.. మహేష్ 27వ సినిమా ఎవరిదన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాకు మహేష్ ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు. మహేష్ 27కోసం దర్శధీరుడు రాజమౌళి పేరు వినిపిస్తోంది. చరణ్-తారక్ మల్టీస్టారర్ తర్వాత రాజమౌళి మహేష్ తో జతకడతాడని చెబుతున్నారు.

ఈ ఇద్దరు దర్శకులు కాకుండా.. మహేశ్ 27వ సినిమా అల్లుఅరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. ఈ సినిమాకు సంచలన దర్శకుడు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సందీప్ మహేష్ కోసం కథని రెడీ చేశారు. ‘చెక్కర ఫ్యాక్టరీ’ టైటిల్ కూడా అనుకొన్నారని వార్తలొచ్చాయ్. ఇప్పుడు సందీప్-మహేష్ సినిమాని అల్లు అరవింద్ టేకప్ చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత ? అనేది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.